
ఆలయంలో ఎలుగుబంటి హల్‌చల్
– నిఘా కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్
అన్నానగర్: నైల్లె జిల్లాలోని కలక్కాడు సమీపంలోని పశ్చిమ కనుమల పాదాల నుంచి 2 కి.మీ దూరంలో చిదంబరంపురం ఉంది. ఈ ప్రాంతంలో చిదంబరంపురం–కలక్కడు ప్రధాన రహదారి వెంబడి ఉయికట్టు సుడలై మాడసామి ఆలయానికి యథావిధిగా మంగళవారం తెల్లవారుజామున పూజరి వచ్చారు. ఆ సమయంలో పూజా సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటంతో షాక్ అయ్యారు. వెంటనే ఆలయంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించారు.ఆ సమయంలో, ఒక ఎలుగుబంటి అర్ధరాత్రి గుడిలోని 4 అడుగుల ఎత్తయిన గోడ ఎక్కి లోపలికి దూకడం కనిపించింది. ఆ ఎలుగుబంటి గుడిలోకి ప్రవేశించి అక్కడ పూజా సామగ్రిని చెల్లచెదరు చేసింది. తర్వాత కొద్దిసేపు తిరుగుతూ మళ్లీ గోడ ఎక్కి బయటకు దూకింది. గుడిలోకి ప్రవేశించి తిరుగుతున్న ఎలుగుబంటి వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.