అన్నానగర్: రూ.3 లక్షలు లంచం తీసుకుని, అవినీ తికి పాల్పడిన కేసులో చైన్నెలో ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ఉన్న ఈంజంబాక్కం, రాజానగర్, వె ట్టువాంగే జంక్షన్‌లో ఆక్రమణల తొలగింపునకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులను పర్యవేక్షించటానికి అడైయార్ తహసీల్దార్ (ల్యాండ్ సర్వే డివిజన్) సరోజను నియమించారు. సామాజిక కా ర్యకర్త పొన్ తంగవేలు తన స్థలంలో ఆక్రమణల తొలగింపును ఆపివేయాలని అధికారులను కోరా డు. ఇక్కడ భూమి విలువ రూ.కోట్లలో ఉన్న కారణంగా తనకు రూ. 3 లక్షలు ఇస్తే ఆక్రమణ లు తొలగించకుండా ఆపివేస్తామని తహసీల్దార్ సరోజ చె ప్పారు. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టప డని తంగవేల్, తహసీల్దార్ సరోజపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ పో లీసులు తంగవేలుకు రసాయనాలు పూసిన రూ.3 లక్షలు ఇచ్చారు. చైన్నెలోని పరంగిమలై సాయుధదళంలో అధికారిగా పని చేస్తున్న సరోజ భర్త ప్రవీ ణ్, అతడి స్నేహితుడు, పరంగిమలై క్రైమ్ బ్రాంచ్ పోలీస్‌గా ఉన్న అరుణ్‌కుమార్ లంచం సొమ్ము అందుకున్నారు. ఆ సమయంలో అరుణ్‌కుమార్, ప్రవీణ్‌తోపాటు తహసీల్దార్ సరోజ అరెస్టు చేశారు. ఈ కేసులో పట్టుబడిన పోలీసు కమిషనర్ అరుణ్‌కుమార్, ప్రవీణ్‌ను పోలీసు కమిషనర్ సందీప్‌రాయ్ రాథోడ్ సోమవారం సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.