కొరుక్కుపేట: చైన్నె కోయంబేడు మార్కెట్‌ను తిరుమళిసైకి తరలించడం లేదని, వదంతులను నమ్మవద్దని అధికారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ కోయంబేడు మార్కెట్‌ను తిరుమళిసైకి తరలిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. వ్యాపారులు, సామాన్య ప్రజలు భయపడొద్దన్నారు. సందేహాలను స్టోర్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. మార్కెట్ తరలించాలంటే ప్రభుత్వం, స్టోర్ మేనేజ్‌మెంట్ నుంచి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, పుకార్లను నమ్మవద్దని కోరారు.