అనిరుధ్‌ సంగీతం | - | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌ సంగీతం

May 27 2023 12:40 AM | Updated on May 27 2023 3:30 PM

కవిన్‌ హీరోగా నూతన చిత్ర ప్రారంభోత్సవం - Sakshi

కవిన్‌ హీరోగా నూతన చిత్ర ప్రారంభోత్సవం

కవిన్‌ చిత్రానికి

తమిళసినిమా: నటుడు కవిన్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా ఎదుగుతున్నారు. టీవీ సీరియల్‌ ద్వారా పరిచయమైన ఈయన ఆ తర్వాత బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యారు. దీంతో కవీన్‌కు సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా ఆయన నటించిన లిఫ్ట్‌ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇటీవల కవిన్‌ కథానాయకుడిగా నటించిన డాడా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు ఇందులో ఆయనకు జంటగా అయోత్తి చిత్రం ఫేమ్‌ ప్రీతి ఇస్రాణి నాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రోమియో పిక్చర్స్‌ సంస్థ అధినేత రాహుల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు, నటుడు సతీష్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దీనికి యువ క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగును నిర్వహించి పూర్తిచేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇది ఈతరం యువతను ఆకట్టుకునే విధంగా కమర్షియల్‌ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement