
జమాబందిలోనే గ్రామీణ సమస్యల పరిష్కారం
వేలూరు: జమబందీల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని ఆరు తాలూకా కార్యాలయాల్లో బుధవారం ఉదయం వెళితే వినతి పత్రాలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా గుడియాత్తం తాలూకా కార్యాలయంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు అధికంగా పింఛన్, ఇళ్ల పట్టాలు, బ్యాంకు రుణాల కోసం విన్నవించడంతో వాటిపై విచారణ జరిపి 15 రోజుల్లోపు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి వారం రోజులపాటు జమాబందీ కార్యక్రమం నిర్వహించడంతో తాలూకా కార్యాలయం ఎదుట అర్జీదారులు బార్లు తీరారు. ఆనకట్ట తాలూకా కార్యాలయంలో డీఆర్వో మాలతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తహసీల్దార్ వెండా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.