
దిశ కమిటీ రాష్ట్ర సభ్యుడిగా కరుణాకరన్
తిరువళ్లూరు: రాష్ట్ర దిశ కమిటీ సభ్యుడిగా తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మానిటరింగ్ చేయడానికి రాష్ట్రస్థాయిలో డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేస్తోంది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి స్టాలిన్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సభ్యులుగా సిఫార్సు చేసింది. ఇందులో తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ పేరును ప్రకటించింది. కాగా దిశ కమిటిలో చోటు దక్కించుకున్న కరుణాకరన్‌కు కేంఽద్రమంత్రి ఎల్. మురుగన్, రాష్ట్ర అధ్యక్షుడు నాయినార్ నాగ్రేందన్ అభినందనలు తెలిపారు.