
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తిరువళ్లూరు: రైతుల కోసం కై వండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్‌లోని కై వండూరులో రైతుల కోసం ప్రత్యక్షంగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, కలెక్టర్ ప్రతాప్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ కై వండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగానే కై వండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజా సభ్యురాలు శివశంకరి, డీఎంకే ఉపకార్యదర్శి కాంచీపాడి శరవణన్, డీఎంకే ఎన్‌ఆర్‌ఐ వింగ్ జిల్లా కార్యదర్శి జైకృష్ణ, డీఎంకే యువజన విభాగం ఉప కార్యదర్శి మోతీలాల్, చిట్టిబాబు, కన్నదాసన్, తిరుత్తువరాజ్ పాల్గొన్నారు.