
● కిడ్స్ గేమ్స్
మేడవాక్కంలోని నవీన్స్ స్టార్‌వుడ్ టవర్స్‌లో 6–13 సంవత్సరాల పిల్లల కోసం బుధవారం ఇంటరాక్టివ్ గేమ్, మాక్ టెయిల్స్, మ్యూజిక్ మార్క్ కిడ్స్ పూల్ పార్టీ కార్యాక్రమం జరిగింది. ఇందులో నవీన్స్ డైరెక్టర్ క్షీర్ వసుధకుమార్, సీఓఓ కల్యాణ రామన్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో పిల్లలు ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. – సాక్షి, చైన్నె
● ఆవిష్కరణ
ప్రోక్టాలజీ సంరక్షణలో స్పెక్ట్రా ఆస్పత్రిగా పురోగతిని సాధిస్తూ అపోలో స్పెక్ట్రా ఏర్పాటైంది. రాఫెలో ప్రొసీజర్‌తో హెమోరాయిడ్స్ కోసం అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేషివ్ రేడియే ఫ్రీక్వెన్నీ థెరపిని పరిచయం చేసింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కొలొరెక్టల్ సర్జన్ డాక్టర్ వాణి విజయ్, సినీ నటి పార్వతి నాయర్, ఏహెచ్‌ఎల్‌ఎల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్ నిశాంత్ మిశ్రా, మెడికల్ డైరెక్టర్ డాక్టర్‌విజయ్ అగర్వాల్ తదితరులు ఈ విధానం గురించి బ్రోచ్‌ర్‌ను ఆవిష్కరించారు. – సాక్షి, చైన్నె
తిరుత్తణిలో రెండోరోజు జమాబందీ
తిరుత్తణి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జమాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులకు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ ప్రతాప్ అందజేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి జమాబందీ శిబిరాలు ప్రారంభమైయ్యాయి. తిరుత్తణి తహసీల్దార్ కార్యాలయంలో రెండో రోజు నిర్వహించిన శిబిరంలో కృష్ణసముద్రం, మద్దూరు, సూర్యనగరం, సహా పది గ్రామాల నుంచి ప్రజలు పాల్గొని, అర్జీలు అందజేశారు. కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో వినతిపత్రాలపై విచారణ జరిపి, అర్హులైన పది మందికి ఉచితంగా ఇంటి పట్టాలు, కుల సర్టిఫికెట్లు, వృద్ధాప్య పింఛన్లు, పట్టా మార్పిడి సర్టిఫికెట్లు సంబంధించి ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేశారు. రెండో రోజు 268 మంది వినతిపత్రాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
24 వరకు ఐటీఐలో
ప్రవేశాలకు దరఖాస్తులు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉన్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్/కన్వీనర్ వి.శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ‘‘ఐటీఐ.ఏపీ.జీఓవి.ఇన్’’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను మే 26వ తేదీలోపు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో పరిశీలన చేయించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 94928 61369, 85000 21856, 94908 06942, 93989 62635 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

● కిడ్స్ గేమ్స్