
మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ
పళ్లిపట్టు: మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ కనువిందు చేశారు. పళ్లిపట్టు గంగజాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామ దేవత కొళ్లాపురమ్మకు మహిషాసురమర్దిని అలంకరణలో కొలువుదీర్చి, మేళతాళాలు, బాణసంచా సంబరాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం గంగమ్మ తల్లి గ్రామ వీధుల్లో ఊరేగి నడివీధిలో కొలువుదీరారు. మహిళలు కుంభం సమర్పించి దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారు ఊరేగింపు సందర్భంగా యువత విభిన్న వేషధారణలో పట్టణంలో సందడి చేశారు. అశేష జనవాహిని నడుమ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి కుశస్థలినదిలో నిమజ్జనం చేశారు.