
లియో చిత్రంలో విజయ్
దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వస్తున్న చిత్రం ఇది. మాస్టర్ సూపర్ హిట్ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ క్రేజీ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. నటి త్రిష ప్రియ ఆనంద్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో నటుడు అర్జున్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్, మిష్కిన్, డానన్స్ మాస్టర్ శాండీ, మలయాళం నటుడు మ్యాథ్యూ థామస్ మొదలగు, పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల కశ్మీర్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే ఆ సమయంలో అక్కడ భూకంపం కారణంగా చిత్ర యూనిట్ వెంటనే చైన్నెకి తిరిగి చేరుకున్నారు. దీంతో లియో చిత్ర తదుపరి షూటింగ్ ఎప్పుడు అన్న ఆసక్తి సినీ వర్గాలతో పాటు విజయ్ అభిమానుల్లోనూ నెలకొంది. కాగా లియో చిత్ర షూటింగ్ అప్డేట్ గురించి తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం బుధవారం నుంచి చైన్నెలో షూటింగ్ నిర్వహించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. కాగా చైన్నెలో షూటింగ్ పూర్తికాగానే లియో చిత్ర యూనిట్ హైదరాబాదుకు బయలుదేరనున్నట్లు సమాచారం.