హీరోపై అభిమానంతో పిచ్చి పని.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ | One Police Constable Suspended Become Actor Vijay | Sakshi
Sakshi News home page

హీరోపై అభిమానంతో పిచ్చి పని.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

May 4 2025 12:57 PM | Updated on May 4 2025 1:28 PM

One Police Constable Suspended Become Actor Vijay

భద్రతా విధుల్లో ఉండాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్‌ తన అభిమాన హీరో కోసం వెళ్లి సస్పెండ్‌ అయ్యాడు.  తమిళగ వెట్రి కళగం నేత విజయన్‌ను కలిసిన పోలీసు కానిస్టేబుల్‌ కదిరవన్‌ను సస్పెండ్‌ చేస్తూ మధురై పోలీసు కమిషనర్‌ లోకనాథన్‌   ఆదేశాలు జారీ చేశారు. విజయ్‌ ప్రస్తుతం కొడైకెనాల్‌లో జన నాయగన్‌ షూటింగ్‌ బిజీలో ఉన్నారు. ఆయన కోసం అభిమానులు కొడైకెనాల్‌కు పోటెత్తుతున్నారు. అదే సమయంలో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో కదిరవన్‌కు అక్కడ డ్యూటీ వేశారు. అయితే, భద్రతా విధులలో ఉండాల్సిన కానిస్టేబుల్‌ సెలవు పెట్టి మరీ కొడైకెనాల్‌లో పత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. యూనిఫాంను పక్కన పెట్టి తానో అభిమాని అని చాటుకునే దిశగా ఆయన విజయ్‌ను కలిసి వచ్చారు. 

అయితే, విధులను పక్కన పెట్టినందుకు గాను కదిరవన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన కదిరవన్‌ తన యూనిఫామ్‌ను తొలగించి విజయ్ రాజకీయ పార్టీ కండువాను ధరించాడు. ఆపై ఆయనతో ఫోటోలు దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement