
కార్తికి గన్సాల్వేష్‌ని సత్కరించి చెక్‌ను అందజేస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె : ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీతో ఆస్కార్ చేజిక్కించుకున్న దర్శకురాలు కార్తికి గన్సాల్వేష్‌ను సీఎం ఎంకే స్టాలిన్ ఘనంగా సత్కరించారు. రూ. కోటి నగదు కానుక మంగళవారం అందజేశారు. వివరాలు.. కోయంబత్తూరు ముదుమలై శరణాలయంలో ఏనుగుల సంరక్షణ, దారి తప్పిన గున్న ఏనుగును బొమ్మన్ , బెల్లి దంపతులు తమ బిడ్డలా సంరక్షించిన విధానాన్ని కళ్లకు గట్టినట్లు( డాక్యుమెంటరీ ద్వారా) కార్తికి ప్రపంచానికి చాటారు.
ఇందుకుగాను ఏకంగా ఆస్కార్ వరించింది. అయితే, తమిళనాడులో ఏనుగుల సంరక్షణ విధానాన్ని ప్రపంచానికి చాటిన ఆ డాక్యుమెంటరీలోని గున్న ఏనుగు సంరక్షకులు బొమ్మన్ , బెల్లి దంపతులను గత వారం సీఎం సత్కరించారు. తలా రూ. లక్ష చొప్పున నగదు అందజేశారు. అలాగే ఈ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి ఆస్కార్ అవార్డుతో చైన్నెకు వచ్చారు. సచివాలయంలో సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి ఆస్కార్ అవార్డును అందజేశారు. ఈసందర్భంగా ఆమెను సీఎం స్టాలిన్ సత్కరించారు. రూ. కోటి నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సీఎస్ ఇరై అన్భు, మంత్రి మదివేందన్,అటవీ శాఖకార్యదర్శి సుప్రియ సాహు, అటవీ అధికారి శ్రీనివాస్ ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో నీతి ఆయోగ్ కమిటీ భేటీ
సీఎం ఎంకే స్టాలిన్‌తో సచివాలయంలో నీతి ఆయోగ్ కమిటీ సమావేశమైంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ కుమార్ నేతృత్వంలోని కమిటీ వర్గాలు ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్‌తో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు, అభివృద్ధి ఫలాలు, భవిష్యత్ కార్యాచరణ, నిధుల సమీకరణ తదితర అంశాల గురించి చర్చించారు.