జిల్లాలో 32.30శాతం సర్పంచ్‌ స్థానాల్లో బీసీల జయకేతనం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 32.30శాతం సర్పంచ్‌ స్థానాల్లో బీసీల జయకేతనం

Dec 19 2025 8:33 AM | Updated on Dec 19 2025 8:33 AM

జిల్ల

జిల్లాలో 32.30శాతం సర్పంచ్‌ స్థానాల్లో బీసీల జయకేతనం

ప్రచార అస్త్రంగా బీసీల పదవులు..

భానుపురి(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల్లో 157 (32.30 శాతం)మంది బీసీ సర్పంచ్‌లు జయకేతనం ఎగురవేశారు. రిజర్వేషన్‌ స్థానాలతో పోల్చితే జనరల్‌ కేటగిరీలోనే 91(42.52 శాతం) మంది గెలుపొందారు. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలకు గాను బీసీ రిజర్వేషన్లలో 66 మంది, జనరల్‌ కేటగిరీలో 91 మంది బీసీలు సర్పంచ్‌ స్థానాలు దక్కించుకున్నారు.

కోర్టు ఆదేశాలతో..

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎస్టీలకు 111 స్థానాలు, ఎస్సీలకు 91, బీసీలకు 66 స్థానాలు, జనరల్‌ కేటగిరీ కింద 218 స్థానాలను రిజర్వ్‌ చేశారు. 2019 ఎన్నికలతో పోల్చితే నూతన గ్రామపంచాయతీలు ఏర్పడడంతో ప్రస్తుత రిజర్వేషన్లతో ఐదు బీసీ స్థానాలు పెరిగాయి. అయితే ప్రభుత్వపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇచ్చే అవకాశం లేకపోగా.. పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్‌ అమలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ప్రధానంగా సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులపై, బీ ఫామ్‌లపై జరగనందున రిజర్వేషన్ల ఆధారంగా తమ మద్దతుదారులను మాత్రమే బరిలో నిలిపే అవకాశం ఉంది. అయితే జనరల్‌ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించి... ఆయా పార్టీలు బీసీలకు న్యాయం చేయాల్సి ఉన్నా బీఫామ్‌లు, పార్టీ గుర్తులు లేకపోవడంతో ఈ మేరకు బీసీలకు ఏ రాజకీయ పార్టీ 42 శాతం రిజర్వేషన్‌ కల్పించిన దాఖలాలు లేవు.

218 జనరల్‌ కేటగిరీ స్థానాల్లో..

జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారు. గ్రామస్థాయిల్లో బీసీలకు ఆర్థిక వనరులు సైతం ఉన్నాయి. జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమను ఓటర్లుగానే కాకుండా రాజకీయంగానూ గుర్తించేలా ఎన్నికల్లో గెలిచి సత్తాచాటారు. తమకు కేటాయించిన 66 రిజర్వ్‌ స్థానాలనే కాకుండా బీసీలు పోటీ చేసేందుకు వీలున్న జనరల్‌ స్థానాల్లోనూ దాదాపు సగం సీట్లను కై వసం చేసుకుని ఔరా అనిపించారు. జిల్లాలో జనరల్‌ కేటగిరీకి 218 స్థానాలను కేటాయించగా 42.52 శాతంతో 91 స్థానాలను దక్కించుకున్నారు. మొత్తంగా 486 గ్రామపంచాయతీలకు గాను 157 స్థానాల్లో బీసీలే గ్రామ ప్రథమ పౌరులుగా ఉండనున్నారు.

మండలాల వారీగా బీసీలకు లభించిన స్థానాలు

మండలం జీపీలు జనరల్‌ జనరల్‌లో బీసీ

బీసీ రిజర్వు

తిరుమలగిరి 16 05 04 01

నేరేడుచర్ల 19 09 02 04

మునగాల 22 11 06 05

చిలుకూరు 17 09 03 03

తుంగతుర్తి 24 09 00 03

జాజిరెడ్డిగూడెం 17 08 06 03

మఠంపల్లి 29 13 01 02

నూతనకల్‌ 17 10 05 02

నాగారం 14 07 04 02

చివ్వెంల 32 10 03 00

హుజూర్‌నగర్‌ 11 06 03 02

మేళ్లచెరువు 16 07 02 03

చింతలపాలెం 16 08 03 03

పెన్‌పహాడ్‌ 29 07 04 02

గరిడేపల్లి 33 16 12 08

మద్దిరాల 16 07 04 03

అనంతగిరి 20 09 02 02

మోతె 29 13 03 03

కోదాడ 16 08 03 04

నడిగూడెం 16 08 07 04

ఆత్మకూర్‌ (ఎస్‌) 30 12 06 04

సూర్యాపేట 25 13 05 03

పాలకవీడు 22 13 03 00

మొత్తం 486 218 91 66

రిజర్వుడ్‌ స్థానాలతో పాటుగా జనరల్‌ కేటగిరీ కింద ఉన్న సర్పంచ్‌లను బీసీ అభ్యర్థులు సగం మేర కై వసం చేసుకున్నారు. దీంతో రానున్న అన్ని ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఈ పదవులు ప్రచార అస్త్రాలుగా మారనున్నాయి. తమ పార్టీల వైపు బీసీలను మళ్లించేందుకు రిజర్వేషన్లను కచ్చితంగా పెంచాలన్న నినాదాన్ని తెరమీదకు తీసుకు రానున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌లు బలంగా బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. ఈ ఫలితాల నేపథ్యంలో మరింతగా బీసీవాదంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వం రిజర్వేషన్‌ కల్పించకున్నా.. పార్టీపరంగా ఇచ్చేందుకు ముందుకు వస్తాయని చర్చించుకుంటున్నారు.

ఫ జనరల్‌ స్థానాల్లో 42.52 శాతం బీసీ అభ్యర్థుల గెలుపు

ఫ బీసీలకు దక్కిన సీట్లపై జోరుగా చర్చ

జిల్లాలో 32.30శాతం సర్పంచ్‌ స్థానాల్లో బీసీల జయకేతనం 1
1/1

జిల్లాలో 32.30శాతం సర్పంచ్‌ స్థానాల్లో బీసీల జయకేతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement