ఉపాధి.. ఊరభివృద్ధికి హామీ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి.. ఊరభివృద్ధికి హామీ

Dec 19 2025 8:33 AM | Updated on Dec 19 2025 8:33 AM

ఉపాధి.. ఊరభివృద్ధికి హామీ

ఉపాధి.. ఊరభివృద్ధికి హామీ

సాగుకు ఊతం.. ‘దారి’ చూపండి..

ఎవరిని సంప్రదించాలి..

గ్రామాల్లో చెరువులు, చెక్‌ డ్యాంలు, ఊట కుంటలు, ప్రాజెక్టు కాల్వల్లో నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే అటు వారికి ఉపాధి చూపడంతో పాటు నీటి వనరులను బాగు చేసుకోవచ్చు.

గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పొలం బాటలు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది.

నాగారం : జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్తగా పంచాయతీ పాలకవర్గం కొలువుదీరనుంది. సర్పంచ్‌గా ఎన్నికై నందుకు సంబరంగా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం అండగా నిలువనుంది. పక్కాగా, ప్రణాళికబద్ధంగా పనులు చేయించగలిగితే కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెలను ప్రగతి దిశగా తీసుకుపోవచ్చు. గతంతో పోలిస్తే పథకంలో కొన్ని మార్పులు చేశారు. పథకం పేరు మార్చడంతో పాటు పని దినాలు 100 నుంచి 125కి పెంచారు. 266 పనులను గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిపై సర్పంచులు దృష్టి సారించాలి.

స్వచ్ఛ గ్రామాలుగా..

గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు.

నీటిని నిల్వ చేసుకునేలా..

సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊట కుంటలు, ఫాంపాండ్స్‌, చెక్‌ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తి చేస్తే భూగర్భ జలమట్టం పెరుగుతుంది.

మొక్కలు నాటుదాం..

గ్రామాల్లో మొక్కలు నాటి హరితవనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబా టులో ఉంది. గుంతలు తవ్వడం మొదలు, మొ క్కలను నాటేందుకు, పోషణకు డబ్బులు ఇస్తున్నారు.

ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో పీడీతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీఓ, సాంకేతిక సహాయకులు, గ్రామాల్లో క్షేత్ర సహాయకులు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి.

సర్పంచ్‌లకు అండగా ఉపాధిహామీ పథకం

ఫ సద్వినియోగం చేసుకుంటే ఎంతో మేలు

ఫ ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తే ప్రగతి పథం

మండలాలు 23

గ్రామ పంచాయతీలు 486

జాబ్‌ కార్డులు 2.63 లక్షలు

కూలీలు 3.33 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement