వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడతాం | - | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడతాం

Dec 19 2025 8:33 AM | Updated on Dec 19 2025 8:33 AM

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడతాం

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడతాం

సాక్షి, యాదాద్రి : రానున్న జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గురువారం భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. కేసీఆర్‌ అనుమతితో జనవరి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వ సేకరణ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిహిస్తామన్నారు. రానున్న జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో భువనగిరి జిల్లాపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలన్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో జిల్లాకు చెందిన మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 30 మంది సర్పంచ్‌లను అక్రమంగా ఓడించారని, కోర్టుకు వెళ్లి న్యాయం పొందుతామన్నారు. సీఐలు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా, ఎస్‌ఐలు మండల కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ చెక్కు చెదరలేదని పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. అధికార పార్టీ ఎన్ని రకాల కుట్రలు పన్నినా క్యాడర్‌ వెన్ను చూపకుండా విజయం సాధించిందన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. ఆలేరు ఎమ్మెల్యే ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా బీఆర్‌ఎస్‌ విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్‌, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, క్యామా మల్లేష్‌, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్‌, కొలుపుల అమరేందర్‌, ఎడ్లసత్తిరెడ్డి పాల్గొన్నారు.

ఫ వచ్చే నెల నుంచి సంస్థాగత ప్రక్రియ ప్రారంభం

ఫ భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగరాలి

ఫ నూతన సర్పంచ్‌ల సన్మాన సభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement