వచ్చేనెలలో పోరాటం ఉధృతం
సూర్యాపేట అర్బన్: మోదీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జనవరి నెలలో అన్ని జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు ఉధృతం చేయనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్‌లను తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తోందని మండిపడ్డారు. దేశంలో నయా ఫాసిస్టు విధానాలు అమలు చేస్తూ కార్మికులను మతం పేరుతో విభజిస్తూ లౌకిక విధానాలను తుంగలో తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకూ 12 గంటల విధానాన్ని ప్రవేశ పెట్టి వేతనాలు పెంచకుండా కార్మికుల నిజ వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. దేశంలో స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయనిది మోదీ ప్రభుత్వమని విమర్శించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె. వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, చెరుకు ఏకలక్ష్మి,ఎం. రాంబాబు, శీలం శ్రీను, వటేపు సైదులు పాల్గొన్నారు.
ఫ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు


