ఊరు.. ఓటరు జోరు | - | Sakshi
Sakshi News home page

ఊరు.. ఓటరు జోరు

Dec 18 2025 7:23 AM | Updated on Dec 18 2025 7:23 AM

ఊరు..

ఊరు.. ఓటరు జోరు

తుది విడతలో ఓటేసేందుకు కదిలిన పల్లెలు

భానుపురి (సూర్యాపేట) : మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనం ఓటెత్తారు. తుదిశలో గ్రామ పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులుదీరారు. ఈ క్రమంలో ఏకగ్రీవాలు పోను 124 గ్రామపంచాయతీలు, 1061 వార్డుల్లో బుధవారం నిర్వహించిన పోలింగ్‌

ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్‌ నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. చాలావరకు ఒంటిగంటకే పోలింగ్‌ ముగియగా.. అక్కడక్కడ ఈలోగా వచ్చిన వారికి అవకాశం కల్పించారు. అత్యధికంగా చింతలపాలెం మండలంలో 90.99 శాతం, అత్యల్పంగా మేళ్లచెర్వు మండలంలో 86.59 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా ఈ విడతలో 89.25 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 1,71,903 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ, జనరల్‌ అబ్జర్వర్‌ రవినాయక్‌ విస్తృతంగా పర్యటించి పోలింగ్‌ సరళి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.

1,176 పోలింగ్‌ కేంద్రాలలో..

మూడో విడత హుజూర్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపు 1,92,617 మంది ఓటర్లు ఉండగా 1,176 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రెండు గంటలకోసారి..

ఏడు మండలాల పరిధిలో 124 గ్రామపంచాయతీలు, 1061 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 7గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. కాగా ప్రతి రెండు గంటలకోసారి అధికారులు పోలింగ్‌ శాతాన్ని ప్రకటించారు. ఉదయం 9గంటల వరకు 24.83 శాతం, 11 గంటల వరకు 60.13 శాతం, ఒంటి గంట వరకు 86.19 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒంటిగంట లోపు పోలింగ్‌ సెంటర్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఇవ్వగా.. చివరగా 89.25 శాతంగా పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ విషయంలోనూ మహిళలే ముందున్నారు. పురుషులు 83,390 మంది ఉండగా 89.04 శాతం, మహిళలు 88,507 ఉండగా 89.44 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

అత్యల్పంగా మేళ్లచెరువు

మండలంలో 86.59శాతం

మండలాల వారీగా చూస్తే చింతలపాలెం మండలంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. చింతలపాలెంలో 90.99 శాతం అనగా 26,056 ఓట్లకు 23,709 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యల్పంగా మేళ్లచెరువు మండలంలో 86.59 శాతమే పోలింగ్‌ నమోదైంది. 29,678 ఓట్లకు 25,698 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

రెండో విడత కన్నా తుది దశలో అధికం

మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత కన్నా తక్కువ, రెండోవిడత కన్నా అధికంగా పోలింగ్‌ శాతం నమోదైంది. మొదటి విడతలో 89.69 శాతం,రెండోవిడతలో 86.78 శాతం, చివరి దశలో 89.25 శాతం పోలింగ్‌ నమోదైంది.

రెండో విడత

మండలం ఓటర్లు మొత్తం శాతం

పోలైవని

చింతలపాలెం 26,056 23,709 90.99

గరిడేపల్లి 41,985 37,301 88.84

హుజూర్‌నగర్‌ 20,467 18,579 90.78

మఠంపల్లి 35,266 31,708 89.91

మేళ్లచెరువు 29,678 25,698 86.59

నేరేడుచర్ల 20,550 18,104 88.10

పాలకవీడు 18,616 16,804 90.27

మొత్తం 1,92,617 1,71,903 89.25

ఫ హుజూర్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌లోని ఏడు మండలాల్లో 89.25 శాతం పోలింగ్‌

ఫ అత్యధికంగా చింతలపాలెం మండలంలో 90.99 శాతం

ఫ ఉదయం నుంచే బారులుదీరిన జనం

ఊరు.. ఓటరు జోరు1
1/2

ఊరు.. ఓటరు జోరు

ఊరు.. ఓటరు జోరు2
2/2

ఊరు.. ఓటరు జోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement