ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ ఆదేశించారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడవ విడత ఎన్నికలు జరిగే చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామన్నారు. 124 సర్పంచ్, 1,176 వార్డుల ఎన్నికల నిర్వహణకు 30 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1,538, ఓపీఓలు 2026 మందిని ర్యాండమైజేషన్ చేశారు. ఈ ప్రక్రియలో జెడ్పీ సీఈఓ వి వి అప్పారావు, డీపీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎన్నికల పరిశీలకుడు రవి నాయక్


