మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి బుధవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు.అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
విద్యార్థులు
లక్ష్య సాధనకు శ్రమించాలి
దేవరకొండ : విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం పట్టుదలతో శ్రమించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. బుధవారం ్చదేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 11వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కళాశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషిచేసిన ప్రిన్సిపాల్ రవితోపాటు అధ్యాపకులను ఆయన అభినందించారు. అనంతరం 2024–25 విద్యాసంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, అధ్యాపకులు కోటయ్య, లింగమయ్య, లింగారెడ్డి, పృథు, ధనుంజయ పాల్గొన్నారు.
పంచ నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. బుధవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మట్టపల్లిలో నిత్యకల్యాణం


