ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. మొదటి విడత ఎన్నికలను పురస్కరించుకొని సూర్యాపేట రూరల్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి పట్టణంలో బుధవారం సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని స్పష్టం చేశారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలు వదలవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, అనుమతిలేని వ్యక్తులను ఓటరు కాని వారిని పరిసరాల్లో రానివ్వొద్దని, 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్‌న్, ఎలక్ట్రానిక్ వస్తులు ఏమైనా వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ఫ ఎస్పీ నరసింహ
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి


