ఊరూరా కిక్కు
నాగారం : జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. మూడు విడతల్లో ఎన్నికలు జరుతున్నాయి. తొలివిడత ఎనిమిది మండలాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఇక రెండు, మూడు విడత ఎన్నిల ప్రచారం జోరుగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ఎరగా వేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా సిట్టింగ్‌లు పెట్టించి మరీ మద్యం పోయిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లోని బెల్ట్ దుకాణాల్లో పెద్ద ఎత్తున డంప్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు మూడింతలు పెరిగినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న లిక్కర్ గోదాములు కిక్కిరిసి ఉంటున్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకుసూర్యాపేట జిల్లాలో రూ.61.91 కోట్ల విలువ గల మద్యం విక్రయాలు జరిగాయి.
తొలిరోజు నుంచే...
జిల్లా వ్యాప్తంగా 93 మద్యం దుకాణాలు, 19 బార్లు ఉన్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త వారికి ట్రేడ్ లైసెన్స్‌లు మంజూరు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వారికి తొలి రోజు నుంచే కాసుల వర్షం కురుస్తోంది. కొత్త దుకాణదారులకు గ్రామాల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. అభ్యర్థులు కొందరు ఏకంగా ఉద్దెర ఖాతాలు పెట్టేశారు. ప్రధానంగా బెల్ట్ దుకాణాలకు ఎక్కువగా సరఫరా అవుతోంది. ఈనెల 17వ తేదీ వరకు ఎన్నికల సందడి ఉండటంతో మద్యం భారీగా అమ్ముడుకానుంది. ఈ విషయంపై సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులను వివరణ కోరగా.. మద్యం దుకాణాల నుంచి పెద్ద మొత్తంలో ఎవరు కొన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు తమ సిబ్బందితో నిఘా పెట్టామని వెల్లడించారు.
ఫ ఈనెల 1 నుంచి 9 వరకు జిల్లాలో రూ.61.91 కోట్ల మద్యం అమ్మకాలు
ఫ పంచాయతీ ఎన్నికలే కారణం


