ఆరు సబ్జెక్టులు.. నెల రోజులు
సూర్యాపేట టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి సబ్జెక్టు మధ్య నాలుగు రోజుల గ్యాప్ రానుంది. దీని వల్ల రివిజన్‌కు సమయం ఉండటంతో పాటు విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉండనుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించేందుకు వీలుంటుంది.
మార్చి 14నుంచి పరీక్షలు
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల ప్రకారం మార్చి 14న పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 16న ముగియనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ప్రతి సబ్జెక్టుకు 20 ఇంటర్నల్ మార్కులు ఉండనున్నాయి. వీటి ఆధారంగా సబ్జెక్టుల వారిగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు.
12,325మంది విద్యార్థులు
జిల్లాలో పదో తరగతి వరకున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 354 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే టెన్త్ విద్యార్థులు 7,000, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు 5,325 మంది ఉన్నారు. వీరంతా వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందని డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
టెన్త్ వార్షిక పరీక్షల విధానంలో మార్పులు
ఫ ప్రతి సబ్జెక్టు మధ్య
నాలుగు రోజుల గ్యాప్
ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల


