రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి
సూర్యాపేట : రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే అందజేయాలని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ అధ్యక్షుడు పొనుగోటి కోటయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.కె సుభాని కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన అనంతరం ఏఓ సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలామంది ఉద్యోగులు పదవీ విరమణ పొంది చాలా కాలం అవుతున్నా వారికి రావాల్సిన గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యుటేషన్, సరెండర్ లీవులు వంటి ఆర్థిక ప్రయోజనాలు ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ ఉపేందర్, దశరథ రామారావు, షేక్ అబ్దుల్లా, విద్యాసాగర్, కృష్ణారెడ్డి, దండ శ్యాంసుందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు వెంకట్రాంరెడ్డి, తీకుళ్ల సాయిరెడ్డి, రాపర్తి రాంనర్సయ్య, జాన్ సుందర్, నాగార్జున రెడ్డి, అంజయ్య, వెంకటేశ్వరరావు, సుధాకర్, కృష్ణమూర్తి, నరేందర్, లింగయ్య పాల్గొన్నారు.
సాగర్‌కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్ : కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం గరిష్టస్థాయిలో ఉండటంతో ఎగువ నుంచి వస్తున్న 1,46,854 క్యూసెక్కుల వరదను.. క్రస్ట్ గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో అన్ని కాల్వలకు నీటిని నిలిపివేశారు.


