13ఎకరాల వరిచేను నేలవాలింది
నా భూమితో పాటు మరికొంత భూమి కౌలుకు తీసుకొని 10ఎకరాల్లో దొడ్డురకం, 3ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని సాగుచేశాను. తీరా పంటచేతికొచ్చే సమయంలో వర్షాలతో మొత్తం నేలవాలింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– మహంకాళి సురేష్, రైతు, కుంచమర్తి, జాజిరెడ్డిగూడెం మండలం
పది రోజుల క్రితం 250 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాను. భారీ వర్షం కురవడంతో కొద్దిగా ధాన్యం మొలకెత్తుతోంది. అధికారులు స్పందించి త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలి.
– భూక్యా వెంకన్న, భూక్యా తండా, రైతు, తిరుమలగిరి మండలం
13ఎకరాల వరిచేను నేలవాలింది


