బీటెక్ విద్యార్థి బలవన్మరణం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఉన్న జేఎన్‌టీయూ క్యాంపస్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన బానోతు మహేందర్(24) సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలోకి వెళ్లి బ్లాంకెట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల అధ్యాపకులకు చెప్పగా, వారు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మహేందర్ తండ్రి చెన్వేశ్వర్‌రావు అక్కడకు చేరుకున్నారు. మహేందర్ బాగానే చదువుకునేవాడని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వానందరాజు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేందర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఫ హాస్టల్ గదిలో ఉరివేసుకున్న
మహేందర్
ఫ సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ
క్యాంపస్‌లో ఘటన


