మనోవిజ్ఞాన నిపుణుల అవసరం ఎంతో ఉంది
నల్లగొండ టూటౌన్: మనుషులు అనేక ఒత్తిళ్లు, ఒడిదుడుకులకు గురవుతున్న సందర్భంలో మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుల అవసరం ఎంతో ఉందని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సైకాలజీ విభాగం నూతన ల్యాబొరేటరీని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలతోపాటు, వృద్ధుల్లో పెరుగుతున్న కుంగుబాటు, నిరుత్సాహం, పిల్లలకు మొబైల్ వినియోగం లాంటి అలవాట్లు కాకుండా ఉండటానికి మనో వైజ్ఞానికులు దిక్సూచిగా సహాయకారిగా నిలవాలని తెలిపారు. కార్యక్రమంలో అలువాల రవి, అరుణప్రియ, అంజిరెడ్డి, ఆకుల రవి, సైకాలజీ విభాగం అధ్యాపకులు అరవింద్, తన్వీర్, నారాయణరెడ్డి, చక్రి పాల్గొన్నారు.
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్


