
మళ్లీ ఇందిరమ్మ సర్వే
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తున్న విషయం విదితమే. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ సొమ్ము అందాలంటే పక్కాగా వివరాలు నమోదై ఉండాల్సి ఉంది. దీనికోసం పీఎం ఆవాస్ యోజన యాప్‌లో లబ్ధిదారుల వివరాలు పొందుపర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను సంబంధిత యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.
వివరాలన్నీ పకడ్బందీగా నమోదు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 6,642 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాగా.. మరికొన్నింటిని ఇందిరమ్మ కమిటీలు పూర్తిచేసి అధికారులకు అందించారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పీఎం ఆవాస్ యోజన యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. లబ్ధిదారుని పేరు, చిరునామా, ఆధార్ సంఖ్య, బ్యాంక్ ఖాతా, గ్రామం, పట్టణం, నగరంతో పాటు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్లు, పేర్లను పొందుపరచాల్సి ఉంది. ఒకవేళ లబ్ధిదారుడు ఉపాధి హామీ పథకం లో కూలీగా ఉన్నట్లయితే జాబ్ కార్డుల వివరాలు కూడా ఈ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
అధికారులకు తప్పని ఇక్కట్లు..
కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ అందాలంటే పక్కాగా ఈ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. అయితే కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్లను నమోదు చేస్తున్న క్రమంలో ఏదైనా పేరులో చిన్న పొరపాటు ఉన్నా యాప్ లో నమోదు కావడం లేదు. వివరాల నమోదుకు చాలా సమయం పట్టడం, సాంకేతిక సమస్యలు వస్తే మరింత ఆలస్యం అవుతుండడంతో అధికారులకు కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ వివరాల నమోదుకు ఈనెలాఖరు వరకే గడువు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో వివరాల నమోదుకు అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
ఫ మరోసారి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నమోదు
ఫ పీఎం ఆవాస్ యోజన యాప్‌లో
వివరాలు అప్‌లోడ్
ఫ కేంద్ర ప్రభుత్వ
రాయితీ అందేలా చర్యలు
ఫ వివరాల నమోదుకు నెలాఖరు
వరకే గడువు
ఫ లబ్ధిదారుల ఇళ్లబాట పట్టిన సిబ్బంది
వివరాలు యాప్‌లో నమోదు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం ఆవాస్ యోజన యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో త్వరలోనే ఈప్రక్రియ పూర్తవుతుంది.
– సిద్ధార్థ, హౌసింగ్ పీడీ
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ఇలా..
మంజూరైనవి 6642
ముగ్గుపోసినవి 1210
రూఫ్ లెవల్ 106
ఆరుఫీట్ల ఎత్తు 276
బేస్‌మెంట్ లెవల్ 796

మళ్లీ ఇందిరమ్మ సర్వే

మళ్లీ ఇందిరమ్మ సర్వే