
పంద్రాగస్టు నాటికి భూ సమస్యలు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : పంద్రాగస్టు నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టర్‌లో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్ లతో వెబ్ ఎక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి సదస్సుల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీదారులకు నోటీసులను అందజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆ తర్వాత రికార్డులను క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ఆర్డీఓలు సమన్వయం చేసుకుంటూ తహసీల్దార్లతో వేగవంతంగా అర్జీలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలకు సంబంధించి గ్రామాల వారీగా సిబ్బంది ద్వారా అర్జీదారులకు నోటీసులు అందజేయాలన్నారు. నూతన రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులు వేగవంతంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ లు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, సూపరింటెండెంట్ సాయి గౌడ్, తహసీల్దార్ లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్