రూ.2లక్షల విలువైన బొట్టుబిల్లలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.2లక్షల విలువైన బొట్టుబిల్లలు స్వాధీనం

Nov 15 2023 1:28 AM | Updated on Nov 15 2023 1:28 AM

రామన్నపేట : ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న రూ. 2లక్షల విలువైన బొట్టు బిల్లలను పోలీసులు పట్టుకున్నారు. రామన్నపేట శివారులో ఏర్పాటు చేసిన అంతర్‌జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి వైపు నుంచి మిర్యాలగూడకు ఆటోలో తరలిస్తున్న బొట్టుబిల్లలతో కూడిన 10కాటన్ల కరపత్రాలను పోలీసులు గుర్తించారు. బొట్టుబిల్లలను స్వాధీనం చేసుకొని, ఆటోను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. ఆ కాటన్లలో మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఫొటోతో కరపత్రాలు ముద్రించి ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement