దళారులను ఆశ్రయించొదు్ద | - | Sakshi
Sakshi News home page

దళారులను ఆశ్రయించొదు్ద

Jun 30 2025 7:28 AM | Updated on Jun 30 2025 7:44 AM

దళారు

దళారులను ఆశ్రయించొదు్ద

నాగారం : ‘ఈ ఏడాదికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక రూ.11,866 కోట్లు లక్ష్యంగా విధించుకున్నాం. ఆర్బీఐ నిబంధనల మేరకే రుణాలు ఇస్తాం. రుణాల కోసం వచ్చే లబ్ధిదారులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంక్‌ మేనేజర్‌, క్షేత్రాధికారిని సంప్రదించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. రాజీవ్‌ యువవికాసం పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సిఫారసు లేకుండా రుణాలు అమలు చేస్తాం’ అని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చింతల బాపూజీ స్పష్టం చేశారు. 2025– 26కు సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కావడంతో ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే..

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తాం. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అన్ని రకాల రుణాలిస్తాం. సిఫారసులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గం. జిల్లాలో జిల్లా, మండల స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల పంపిణీలో కలిగే సమస్యలపై సిబ్బందితో మాట్లాడి పరిష్కరిస్తాం.

గతేడాది రూ.10,425.41కోట్ల రుణాలు ఇచ్చాం

గత ఏడాది 2024–25కు సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక జిల్లాకు రూ.8994.61కోట్లుగా ఖరారు చేశాం. అయితే 100శాతం లక్ష్యం పూర్తి కావడంతో ఆయా రంగాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో రూ.1430.8 కోట్లు చెల్లింపులు చేశాం. మొత్తంగా జిల్లాలో రూ.10,425.41 కోట్ల రుణాలు ఇచ్చాం. వీటిలో వ్యవసాయ రంగానికి రూ.6,793 కోట్లు, చిన్నమధ్య తరహా పరిశ్రమలకు రూ.1,081 కోట్లు, విద్యారుణాలు రూ.36 కోట్లు, గృహ రుణానికి రూ.180, నాన్‌ ప్రియారటీ సెక్టార్‌ కింద రూ.2335.41 కోట్ల రుణాలు ఇచ్చాం.

అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం

బీమా పథకాలపై ఖాతాదారులు, ప్రజలకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. మున్సిపాలిటిల్లో పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బంది చేత బీమా చేయించాం.

పీఎంఎంవై రుణాలు అత్యధికంగా

ఇచ్చిన జిల్లాగా ఎంపిక

ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) రుణాలు అత్యధికంగా ఇచ్చిన జిల్లాగా రాష్ట్రం నుంచి సూర్యాపేట జిల్లా ఎంపికై ంది. ఇందుకుగాను ఈ ఏడాది ఏప్రిల్‌– 6న ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా నిర్వహించిన పీఎంఎంవై దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యాం.

నేరుగా బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించాలి

రుణాల కోసం వచ్చే బ్యాంక్‌ ఖాతాదారులు, లబ్ధిదారులు పైరవీకారులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంక్‌ మేనేజర్‌, క్షేత్రాధికారిని సంప్రదించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ఏ రుణమైనా ఆర్బీఐ నిబంధనల మేరకే ఇస్తాం. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు విద్యా రుణాలిస్తున్నాం. విద్యారుణం తీసుకున్న కుటుంబానికి అప్పు భారం కాకుడదన్న ఉద్దేశంతో క్రెడిట్‌ లింక్‌ టర్మ్‌ బీమా తప్పనిసరి. సంక్షేమం, రాజీవ్‌ యువవికాసం పథకాలకు సంబంధించి అర్హులైన లబ్దిదారులకు ఎలాంటి సిఫారసు లేకుండా రుణాలు అమలు చేస్తాం. రాజకీయ నాయకుల ప్రమేయానికి ఆస్కారం లేదు.

పారదర్శకంగా రుణాల అందజేత

ఏ రుణమైనా ఆర్బీఐ నిబంధనలే ప్రామాణికం

2025– 26కు సంబంధించి

రుణ లక్ష్యం రూ.11,866 కోట్లు

వ్యవసాయ రంగానికి రూ.3861.42 కోట్లు.. అనుబంధ రంగాలకు రూ.2,999.49 కోట్లు

జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చింతల బాపూజీ

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.2418.38 కోట్లు

ఈఏడాది జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక రూ.11,866 కోట్లు లక్ష్యంగా విధించుకున్నాం. వీటిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ రూ.3861.42 కోట్లు రుణాలివ్వనున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2999.49 కోట్లు అందించనున్నాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.2418.38 కోట్లు, విద్యా రుణాలు రూ.36 కోట్లు, గృహ రుణాలు రూ.180 కోట్లు, నాన్‌ ప్రియారటీ రంగానికి రూ.2,370.71 కోట్లు ఇవ్వాలని లక్ష్యం విధించుకున్నాం.

దళారులను ఆశ్రయించొదు్ద1
1/1

దళారులను ఆశ్రయించొదు్ద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement