
చివ్వెంలలో ఏర్పాటు చేసిన నర్సరీ
తొమ్మిదో విడత హరితహారానికి సన్నాహాలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట): జిల్లాలో తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమానికి అధికాలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 శాఖల ఆధ్వర్యంలో 52.50లక్షల మొక్కలు నాటాలని ఆయా శాఖలు లక్ష్యం పెట్టుకున్నాయి. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో జామ, దానిమ్మ, నేరేడు, గన్నేరు, మందార వంటి మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. గత ఏడాది ప్రతి శాఖకు టార్గెట్ ఇచ్చి మొక్కలు నాటాలని సూచించినా తూతూమంత్రంగా నాటి సంరక్షణ మరిచాయనే ఆరోపణలు ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి వంద శాతం లక్ష్యం దిశగా అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
ప్రతి పంచాయతీలో 10వేలకు తగ్గకుండా..
జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో ఉన్న నర్సరీలో 10 వేల మొక్కలకు తగ్గకుండా సుమారు 50లక్షలను పెంచుతున్నారు. అదేవిధంగా అటవీ శాఖ కూడా తమ పరిధిలోని నర్సరీల్లో మొక్కలను పెంచుతోంది. ఇక మున్సిపాలిటీలు కూడా మొక్కలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మొక్కలన్నీ హరితహారం ప్రారంభం నాటికి అందుబాటులోకి వస్తాయి. తొమ్మిదో విడత హరితహారం అధికారికంగా ప్రారంభం కాకపోయినా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 2లక్షల మొక్కలను వివిధ కార్యక్రమాల్లో భాగంగా నాటారు.
సంరక్షణపై శ్రద్ధ పెట్టేనా..
ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతోంది. నర్సరీల్లో పెంచిన మొక్కలను హరితహారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నాటుతున్నా వాటిని సంరక్షించడంలో అధికారుల లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలన్నీ బతకడం లేదు. కొన్ని శాఖలైతే నామమాత్రంగా మొక్కలు నాటి లక్ష్యం చేరినట్లు లెక్కలు చూపుతున్నాయనే విమర్శలున్నాయి. దీంతో హరితహారం లక్ష్యం నెరవేరడంలేదు. ఈ సారైనా మొక్కల సంరక్షణపై అధికారులు పూర్తిస్థాయిలో శ్రద్ధ పెడతారో లేదో వేచిచూడాలి.
శాఖలవారీగా నాటనున్న మొక్కలు ఇలా..
శాఖ లక్ష్యం
అటవీ శాఖ 6లక్షలు
డీఆర్‌డీఏ 25 లక్షలు
మున్సిపల్ 10లక్షలు
ఇరిగేషన్ 3లక్షలు
ఉద్యానవన 30 వేలు
వ్యవసాయ 30వేలు
విద్యాశాఖ 60వేలు
ఆర్‌అండ్‌బీ 60వేలు
మార్కెటింగ్ 30వేలు
ఎకై ్సజ్ 70వేలు
దేవాదాయ 60వేలు
ఆరోగ్య 30వేలు
పోలీస్ 30వేలు
పరిశ్రమలు 60వేలు
సంక్షేమ 40 వేలు
పశువైద్య 10వేలు
విజయవంతంగా నిర్వహిస్తాం
జిల్లాలో త్వరలోనే హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటుతాం. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇస్తాం. ఈ ఏడాది కాల్వలకు ఇరువైపులా బండ్ ఏర్పాటు చేసి మొక్కలు నాటిస్తాం.
– కిరణ్‌కుమార్, డీఆర్‌డీఓ
ఫ 16 శాఖల ఆధ్వర్యంలో
మొక్కలు నాటేలా ప్రణాళిక
ఫ గ్రామీణ నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు
