
సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్, ఎస్పీ తదితరులు
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎక్స్‌గేషియా వివరాలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి దయానందరాణి వివరిస్తూ 2016 నుంచి ఇప్పటివరకు 25 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి త్వరితగతిన కేసును విచారణ చేసి ప్రాథమికంగా 25శాతం నష్టపరిహారం ఇప్పించాలని సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఆర్‌డీఓలు రాజేంద్రకుమార్, వెంకారెడ్డి, కిషోర్‌కుమార్, సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, డీటీడీఓ శంకర్, డీఎఫ్‌ఓ ఉపేందర్ సింగ్, ఎస్‌డీపీఓ వెంకటేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ పీపీ రాథోడ్ సుభాష్ ,అడ్వకేట్ దాచేపల్లి లింగయ్య, కమిటీ సభ్యులు వెంకారెడ్డి, సీహెచ్ రాములు, ఎన్. ప్రకాష్‌బాబు, గూగుల్ అచ్చమ్మ, బుక్కా రవి, ఎ. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్