మూడున్నర కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

మూడున్నర కిలోల గంజాయి స్వాధీనం

Feb 7 2026 3:02 PM | Updated on Feb 7 2026 3:02 PM

మూడున్నర కిలోల గంజాయి స్వాధీనం

మూడున్నర కిలోల గంజాయి స్వాధీనం

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ టికెట్‌ కౌంటర్‌ ఆవరణలో శుక్రవారం మూడున్నర కిలోల గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడినట్లు ఆమదావలస ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు తెలిపారు. నిందితుడు ఒడిశాకు చెందిన చించాను సురేష్‌గా గుర్తించామన్నారు. మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాయగడకు చెందిన సిబా మిస్సాల్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరిద్దరిపైనా కేసు నమోదు చేశామన్నారు. సురేష్‌ను రిమాండ్‌కు తరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement