ఘనంగా మహాలింగార్చన
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం మా స శివరాత్రి సందర్భంగా అనివెట్టి మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో శివ పంచాయతన సహిత మహా లింగార్చనను అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయ హుండీ కానుకల ఆదాయం రూ. 20,05,150 వచ్చిందని ఇన్‌చార్జి ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. గురువారం ఆలయ బేడా మంట పం వద్ద పర్యవేక్షణాధికారి జి.గురునాథం ఆధ్వర్యంలో ఆలయ హుండీలతో పాటు సమీ ప పాతాళ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. 70 రోజులుకు గాను ఈ ఆదాయం వచ్చిందని, ఈ మొత్తాన్ని బ్యాంకు లో జమచేశామని పర్యవేక్షణాధికారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు, పాలకమండలి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఉపాధి హామీ చట్టంలోని మార్పులను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో ఈ నెల 20న కలెక్టర్‌కు వినతి పత్రం, మండల కేంద్రాలు, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వెలమల రమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో సీఐటీయూ కార్యాలయంలో నాలు గు సంఘాలతో కలిపి ఐక్యతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిక్ భారత్– గ్యారంటీ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్(వీజీ జీఆర్ ఏఎంజీ) బిల్లును ఖండించారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాసరి లక్ష్మీనారాయణ, కేవీపీఎస్ నాయకులు బొమ్మాలి రమణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టులంతా
ఏకంకావాలి
పలాస : దేశంలో కాషాయికరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులంతా ఏకం కావాలని సి.పి.ఐ.ఎం.ఎల్.లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో గురువారం లిబరేషన్ పార్టీ జాతీయ నాయకుడు వినోద్ మిశ్రా వర్ధంతి సందర్భంగా ఆయన రచనల తలుగు అనువాద పుస్తకాన్ని బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద ఆవిష్కరించారు. లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల మల్లేశ్వరరావు, సి.పి.ఐ జల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సి.పి.ఎం.జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూడెమొక్రసీ నాయకుడు జుత్తు వీరాస్వామి, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకురాలు పోతనపల్లి అరుణ, ప్రజాకళామండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొర్రాయి నీలకంఠం, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల రామారావు, పత్తిరి దానేసు, దాసరి శ్రీరాములు, పోతనపల్లి కుసుమ, కుత్తుం దుష్యంతు, పి.అప్పారావు, మద్దిల కై లాస్ తదితరులు ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల తోవలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొర్రాయి నీలకంఠం బృందం ప్రజా ఉద్యమ గీతాలను ఆలపించారు.
ఘనంగా మహాలింగార్చన
ఘనంగా మహాలింగార్చన
ఘనంగా మహాలింగార్చన


