●వైఎస్ జగన్‌ను కలిసిన నాయకులు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌లు కలిశారు. గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలన్నారు.
– శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)
●వైఎస్ జగన్‌ను కలిసిన నాయకులు
●వైఎస్ జగన్‌ను కలిసిన నాయకులు


