30న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు ‘తపాలా అదాలత్’ నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు గురువారం తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని రెల్ల వీధి, ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయంలో అదాలత్ జరుగుతుందని పేర్కొన్నారు. తపాలా సేవలకు సంబంధించి సమస్యలు ఉన్నవారు ఈ నెల 29లోపు తమ దరఖాస్తులను ‘తపాలా అదాలత్‘ అనే శీర్షికతో వి.హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసె స్, శ్రీకాకుళం డివిజన్, శ్రీకాకుళం– 532001’ అనే చిరునామాకు పంపాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలో కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అదాలత్ రోజున వ్యక్తిగతంగా హాజరై కూడా ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల జట్ల ఎంపికలను ఈ నెల 21న సింగుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వ హించాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్ణయించింది. పురుషులు 85 కేజీలలోపు, మహిళలు 75 కేజీలలోపు బరువు ఉండాలని నిర్వాహకు లు స్పష్టం చేశారు. ఎంపికై న జిల్లా జట్లను కర్నూలు వేదికగా జరగనున్న రాష్ట్రపోటీలకు పంపిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ఎంపికలు మొదలవుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాదు ముసలినాయుడు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ సాదు శ్రీనివాసరావు (94419 14214)ను సంప్రదించాలని కోరారు.
నరసన్నపేట : కిళ్లాం గ్రామ పరిధిలో కోత దశ లో ఉన్న 4.70 సెంట్ల చెరకు పంట గురువారం దగ్ధమైంది. విద్యుత్ లైన్లు ఒకదానికొకటి కలవడంతో మంటలు చెలరేగడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని మాజీ సర్పంచ్ రామన్న తెలిపారు. బాన్న అప్పారావుకు చెందిన రెండున్నర ఎకరాలు, గొండు రమణకు చెందిన ఎకరా న్నర, రువ్వ రమేష్‌కు చెందిన 70 సెంట్ల పొలంలో పంట కాలిపోయింది. కౌలుకు తీసుకుని సా గు చేస్తున్నామని, మరో వారంలోగా పంట చేతికందుతుందనగా కాలిపోయిందని, ఈ నష్టం ఎలా తట్టుకోగలమని రైతులు వాపోయారు.


