ఆశ్రమ పాఠశాల సందర్శన
మెళియాపుట్టి: ఇటీవల బందపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా గిరిజన సంఘం కార్యదర్శి నిమ్మక అప్పన్న బుధవారం పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై విద్యార్థులు, సిబ్బందికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశీలించామని ప్రహరీ లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మౌలిక సదుపాయాలు సంతృప్తికరంగా లేవన్నారు. సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. ఆయనతో పాటు అరిక మన్మథరావు, సవర భాస్కరరావు, బి.గవరయ్య తదితరులు ఉన్నారు.


