‘కార్గో ఎయిర్‌పోర్టు’ వద్దంటే వద్దు | - | Sakshi
Sakshi News home page

‘కార్గో ఎయిర్‌పోర్టు’ వద్దంటే వద్దు

Oct 31 2025 7:38 AM | Updated on Oct 31 2025 7:38 AM

‘కార్గో ఎయిర్‌పోర్టు’ వద్దంటే వద్దు

‘కార్గో ఎయిర్‌పోర్టు’ వద్దంటే వద్దు

పలాస: మందస మండలంలో ప్రభుత్వం తలపెట్టిన కార్గో ఎయిర్‌ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేయాలి, బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్ష ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు కాశీబుగ్గలోని ఒక కల్యాణ మండపంలో గురువారం కార్గో ఎయిర్‌ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, సీపీఐ ఎం.ఎల్‌ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పోరా ట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్‌ పోర్టు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరారు. అలాగే నవంబరు 18న పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓ వైపు తుఫాన్‌లో జనం బిక్కుబిక్కు మంటూ ఉంటే భూ సర్వే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇది కట్టాలనుకుంటున్నారో ప్రజలు తెలుసుకుంటున్నారని, మీ ఆటలు ఇక్కడ సాగ వని హెచ్చరించారు. జీడి కొబ్బరి రైతులకు గి ట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.మోహనరావు, తెప్పల ఆజయ్‌కుమార్‌, మద్దిల రామారావు, ఎన్‌.గణపతి, కె.శ్రీనివాసరావు, పుచ్చ దు ర్యోధనరావు, బత్తిన లక్ష్మణరావు, గుంటు లోకనాథం, గుంటు రామస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement