 
															అపరాలకు దెబ్బ
కొత్తూరు: మోంథా తుఫాన్ వల్ల మినుము, పెసర వంటి పంటలకు అపార నష్టం వాటిల్లింది. జిల్లాలోని కొత్తూరు, హిరమండలం, లావేరు, ఎచ్చెర్ల, బూర్జ, సరుబుజ్జిలి మండలాలతో పాటు పలు మండలాల్లో ఉన్న మెట్టు ప్రాంతాల్లో సుమారు 230 హెక్టార్లలో మినుము, పెసర, కంది వంటి అపరాలను రైతులు సాగు చేస్తున్నారు. మరో 10 నుంచి 15 రోజుల్లో చేతికి అందుతుంది అనుకున్న పంట తుఫాన్‌కు నాశనమైంది.
పరిశీలిస్తాం
తుఫాన్ వల్ల నష్టపోయిన అపరాల పంటలను పరిశీలన చేస్తాం. మండల వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో గ్రామ వ్యవసాయ సహయకులు పంటలు పరిశీలించి నమోదు చేస్తారు. – కె.త్రినాథ స్వామి,
జేడీ, జిల్లా వ్యవసాయ శాఖ, శ్రీకాకుళం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
