 
															పకడ్బందీగా లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గర్భస్థ పిండ లింగ నిర్ధార ణ నిరోధక చట్టం అమలులో నిర్లక్ష్యం సహించేది లేదని ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులు, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సమావేశంలో అడిగిన కీలక గణాంకాలు సమర్పించకపోవడంపై డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్.ఎన్.పేట పీహెచ్ సీలో గర్భస్రావాల శాతం 11, సారవకోట, బొంతు పీహెచ్‌సీల్లో 10 శాతంగా నమోదైందని, జాతీయ సగటు కంటే ఇక్కడ అధికంగా ఉన్నందున ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు కఠినతరం చేయాలని ఆదేశించా రు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్‌కుమార్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ అనిత, కమిటీ కన్వీనర్ శ్రీకాంత్, డీఐఓ రామదాస్, డీసీహెచ్‌ఎస్ కళ్యాణ్ బాబు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, సామాజిక కార్యకర్త, ఎం.వెంకటస్వామి, డాక్టర్ దానేటి శ్రీధర్, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ప్రసాదరావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
