వర్షార్పణం | - | Sakshi
Sakshi News home page

వర్షార్పణం

Oct 31 2025 7:24 AM | Updated on Oct 31 2025 7:24 AM

వర్షా

వర్షార్పణం

టన్నుల ఎండు చేపలు

లక్షల్లో నష్టం వాటిల్లిందని

మత్స్యకారుల

ఆవేదన

30

ప్రభుత్వం ఆదుకోవాలి

సముద్రం వేటనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. తుఫా న్లు, గాలి వానలు వచ్చిన స మయంలో వారం, పది రోజు లపాటు ఎలాంటి భృతిలేకుండా కుటుంబా లతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాది. ఎన్నో ఆశలతో ఎండలో ఆరబెట్టిన ఎండు చేపలు పూర్తిగా తడిసిపోయాయి. అవి అమ్మకానికి పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – కోడ కృపారావు,

బాధిత మత్స్యకారుడు, డొంకూరు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం

తుఫాన్‌కు కురిసిన వర్షాలకు ఎండు చేపలు తడిసిపోయినట్లు గుర్తించాం. ఇప్పటికే బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశాం. – సలాడి ముసలనాయుడు,

ఎఫ్‌డీఓ, ఇచ్ఛాపురం మండలం

ఇచ్ఛాపురం రూరల్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్‌ ప్రభావం తీర ప్రాంత మత్స్యకారులపై పడింది. ఈ తుఫాన్‌తో కురిసిన వర్షాలకు, గాలివానలతో డొంకూరు సాగర తీర ప్రాంతంలో ఎండబెట్టిన కవ్వళ్లు, నెత్తళ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. గ్రామంలో 60 మంది మత్స్యకారులకు చెందిన 30 టన్నుల ఎండు చేపలు పాడవడంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వారం రోజుల కష్టంతో ఎండబెట్టిన చేపలు కేవలం గంటల వర్షంతో పాడైపోవడంతో బాధితులు నిరాశకు గురయ్యారు. తుఫాన్‌ హెచ్చరికలు వచ్చినప్పటికీ చేపలను సురక్షిత ప్రదేశాలకు తరలించే సమయం దొరకలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎండు చేపలకు గిరాకీ

ఏటా అక్టోబర్‌ నుంచి జనవరి వరకు సముద్రంలో లభించే కవ్వళ్లు, నెత్తళ్ల చేపలను మత్స్యకారులు కొందరు ఎండబెట్టి అమ్మకాలు చేస్తే, మరికొంత మంది ఉప్పు జాడీలో ఉంచి వాటిని మళ్లీ ఎండలో ఆరబెట్టి అమ్మకాలు చేస్తుంటారు. వీటి ధర కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. వీటిని కోల్‌కతా, ముంబై, మద్రాస్‌, భువనేశ్వర్‌, కటక్‌, హైదరాబాద్‌, విజయవాడ, గోదావరి, బెంగళూరు వంటి ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ ఎండు చేపల్ని దా ణాగా మార్చి కోళ్లు, చేపలకు మేతగా మార్చేందుకు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మోంథా తుఫాన్‌ తమ బతులకును ముంచేసిందని బాధిత మత్స్యకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

వర్షార్పణం
1
1/2

వర్షార్పణం

వర్షార్పణం
2
2/2

వర్షార్పణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement