 
															ప్రచారంలో పీక్
● తుఫాన్ సహాయక చర్యల్లో వీక్..
సాక్షి, అమరావతి/నరసన్నపేట: మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కానీ ప్రచార ఆర్భాటంలో మాత్రం హంగా మా చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కో– ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలంతా తమ ప్రాంతాల పరిస్థితిని వివరించారు.
రైతులను పట్టించుకునే దిక్కే లేదు..
మోంథా తుఫాన్‌పై సాయం కంటే ప్రచారమే అధికంగా ఉంది. తుఫాన్ వల్ల వరి మాత్రం బాగా దెబ్బతింది. మా దగ్గర 80 శాతం పంట నష్టం జరిగింది. ప్రభావిత ప్రాంతాల్లో నాయకులందరం అందుబాటులో ఉండి తిరిగాం. రైతుల తర్వాత తీవ్రంగా నష్టపోయింది మత్స్యకారులు. తెప్పలు, బోట్లు దెబ్బతిన్నాయి. కాకినాడ రూరల్‌లో ఒక మత్స్యకార యువకుడు చనిపోయాడు. వారికి జరిగిన నష్టం ప్రజలకు కనిపించదు. ప్రచారం పీక్. సహాయ కార్యక్రమాలు వీక్‌గా ఉంది. ఉచిత పంటల బీమాలో ప్రీమియం ఒక్కో జిల్లాలో ఒక విధంగా ఉంది. దీని వల్ల రైతులపై చాలా భారం పడుతోంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో, రైతులపై ఇన్స్యూరెన్స్ ప్రీమియం భారం ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికి, నష్టం చాలా తక్కువ చూపుతున్నారు. ఇంకా మార్కెటింగ్ శాఖ పనితీరు మరీ భయానక స్థితిలో ఉంది. ఏ సీజన్‌కి ఆ సీజన్‌లో మనం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకుంటే, ఇప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ అమలు కావడం లేదు. నిన్న ప్రాథమిక అంచనాలు చూస్తే ఆర్ అండ్ బీ రోడ్లు 297 రోడ్లు మీద నుంచి వరద నీరు ప్రవహించి రూ.1424 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కానీ పంటలు మాత్రం రూ. 300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పుకుంటున్నారు. ఇంత భారీ వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతే పంటలు ఆగుతాయా?
– కురసాల కన్నబాబు, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్
రైతులంతా మనల్నే తలచుకుంటున్నారు
జిల్లాలో 10 మండలాల్లో పంట నష్టం జరిగింది. 53 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం చూపింది. 30 శిబిరాలు పెట్టామని 800 మందిని తరలించామని చెబుతున్నారు. ఇప్పుడు రైతులంతా మనల్ని తల్చుకుంటున్నారు. మన హయాంలో జరిగిన మేలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు వైఎస్ జగన్ లాంటి నాయకుడు మనకు అవసరమని చర్చించుకుంటున్నా రు. కష్టాలు వచ్చినప్పుడే సరైన నాయకత్వం గుర్తుకు వస్తుంది. ఈ ప్రభుత్వంలో రైతులు ఏమీ ఆశించడం లేదు. – ధర్మాన కృష్ణదాస్,
పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు.
కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
తుఫాన్ సహాయక పనుల్లో కనిపించని మంత్రులు
వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్‌సీపీ నేతల వెల్లడి
 
							ప్రచారంలో పీక్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
