 
															పుస్తకావిష్కరణ
పాతపట్నం: ఆంగ్లభాషపై ఆసక్తిని పెంచే పుస్తకాలను కవులు రచించారని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో రొంపివలస హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు బీవీ రమణ రచించిన మై లిటిల్ వరల్డ్ ఆఫ్ క్యూసెన్ ఆంగ్ల పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో వివిధ రకాల ప్రశ్నలు ఎలా వేయాలనే అంశాలతో కూడిన పుస్తకమని తెలియజేశారు. కార్యక్రమంలో జిత్తు సింహాచలం, ఎంఈవోలు ఎ.గోవిందరావు, సీహెచ్ తిరుమలరావు, కె.రాంబాబు, ఎం.వెంకటరమణ, హెచ్‌ఎంలు ఎన్.కుమారస్వామి, బి.సింహాచలం, కె.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
