 
															పూడిలంకకు దారి
వజ్రపుకొత్తూరు: తుఫాన్, వరదలు వస్తే చాలు ఉప్పుటేరు పొంగడం.. ఆపై వరద ముప్పు అంటూ నిత్యం వార్తల్లో నిలిచే పూడిలంకకు దారి దొరికింది. ఇటీవల రహదారి నిర్మాణంపై సాక్షి పత్రికలో ‘నత్తే నయం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రావెల్‌ను శరవేగంగా వేసి తాత్కాలిక రహదారి నిర్మించారు. దీంతో కొంతమేర కష్టాలు తీరాయి. బుధవారం అధికారులు, సర్పంచ్ తిమ్మల కృష్ణారావు తదితరులు రహదారిని పరిశీలించారు. అయితే ఇంకా రహదారిపై వంతెన, బీటీ నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
