 
															రైతులతో ఆడియో కాన్ఫరెన్స్
ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్‌లు బుధవారం మల్టీ లొకేషన్ ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమదాలవలస, గార, శ్రీకాకుళం, రణస్థలం, పలాస, టెక్కలి తదితర మండలాల్లోని 70 మందికి పైగా రైతులకు సలహాలు అందజేశారు. మోంథా తుఫాన్ ప్రభావంతో వరిలో పొట్ట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులతో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి జి.తిరుమలరావు, శ్రీకాకుళం సపోర్టర్ బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
