 
															చిన్నారుల సంరక్షణకు ముందడుగు
జలుమూరు: మండలంలోని చల్లవానిపేట పరిసర ప్రాంతాల్లో మతి స్థిమితం లేని తల్లి లక్ష్మితో పాటు చిన్నారులు పద్మ, బోడెమ్మ, కరువమ్మల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తామని సారవకోట సీడీపీవో సీహెచ్ వంశీ ప్రియ తెలియజేశారు. ఈనెల 26వ తేదీన ‘ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు’ శీర్షికతో సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. బుధవారం చల్లవానిపేటలో అనాథ చిన్నారులతో మాట్లాడారు. అలాగే సారవకోట మండలం బద్రి గ్రామానికి వెళ్లి బంధువులు, సోదరి కుటుంబ సభ్యులతో చర్చించారు. న్యాయస్థానం అనుమతితో లక్ష్మిని మానసిక వైద్యశాలకు తరలించి మంచి వైద్యం అందించడంతో పాటు చిన్నారులకు చైల్డ్ వెల్ఫేర్ బోర్డు కమిటీ ద్వారా విద్య, వసతి ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షరాలు మనోరమ, సిబ్బంది ఉన్నారు.
 
							చిన్నారుల సంరక్షణకు ముందడుగు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
