 
															2న సబ్ జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నవంబర్ 2న జరగనున్నాయని జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాధు ముసలినాయుడు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఇండోర్ స్టేడియం (స్విమ్మింగ్ ఫూల్) వద్ద కబడ్డీ శిక్షణా కేంద్రంలో ఉదయం 9 నుంచి ఎంపికల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. 2009 డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. బాలురు 60 కేజీలు, బాలికలు 55 కేజీల్లోపు బరువు కలిగి ఉండాలని స్పష్టంచేశారు. మ్యాట్‌పై జరిగే ఈ ఎంపికలకు క్రీడాకారులు విధిగా మ్యాట్ షూ ధరించి హాజరుకావాలన్నారు. కాగా, ఏపీ రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ చాంపియన్‌షిప్–2025 పోటీలు నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. కర్నూల్ జిల్లా మంత్రాలయం వేదికగా జరిగే ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఇక్కడ ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు జిల్లా కబడ్డీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు(సెల్: 94419 14214)ను సంప్రదించవచ్చు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
