 
															మాదినకు రైతునేస్తం పురస్కారం ప్రదానం
కంచిలి : పశు సంవర్థక శాఖలో 31 సంవత్సరాలుగా అందించిన సేవలకు గుర్తింపుగా పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన విశాఖపట్నం పశుసంవర్థకశాక ఉపసంచాలకుడు డాక్టర్ మాదిన ప్రసాదరావు రైతునేస్తం పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినూత్న సేవలు అందించే శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, ఆదర్శ రైతులకు ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రసాదరావు పురస్కారం అందుకున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
