క్వాంటమ్‌తో సమూల మార్పులు | - | Sakshi
Sakshi News home page

క్వాంటమ్‌తో సమూల మార్పులు

Oct 27 2025 7:06 AM | Updated on Oct 27 2025 7:06 AM

క్వాం

క్వాంటమ్‌తో సమూల మార్పులు

ఎచ్చెర్ల : రాజీవ్‌ గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో జరుగుతున్న క్విస్కిట్‌ ఫాల్‌ –2025 ఉత్సవంలో ఆరో రోజు ఆదివారం విద్యార్థుల్లో నూతనోత్సాహాన్నినింపింది. ఈ సందర్భంగా ఐబీఎం శాస్త్రవేత్త డాక్టర్‌ రతజిత్‌ మజుందార్‌ మాట్లాడుతూ క్వాంటం ద్వారా ప్రపంచంలో అనేక మార్పులను తీసుకురాగలమని చెప్పారు. అనంతరం క్వాంటమ్‌ ఆల్గారిథమ్స్‌పై పేరణాత్మక సెషన్‌ నిర్వహించారు. క్వాంటమ్‌ సూత్రాలు, ప్రయోగాత్మక అన్వయాలు, భవిష్యత్తు సాంకేతికతలలో పాత్రను వివరిస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆసక్తిని పెంచారు. డాక్టర్‌ జాన్‌ యల్లా మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో క్వాంటమ్‌ సమస్యల పరిష్కారాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్యాంపస్‌ డైరెక్టర్‌ కొక్కిరాల వెంకట బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృస్ణ, డీన్‌ శివరామకృష్ణ, ఫైనాన్స్‌ అధికారి వాసు, గేదెల రవి, రమేష్‌, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అబుదాబిలో వలస కూలీ మృతి

కంచిలి: పురుషోత్తపురం పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన వలస కూలీ నక్క నరసింహారావు(49) అబుదాబిలో శుక్రవారం మృతిచెందాడు. నెల రోజుల క్రితం అబుదాబిలో ఎన్‌.ఎస్‌.హెచ్‌. కంపెనీలో వెల్డర్‌గా పనిచేసేందుకు వెళ్లాడని, అక్కడ కడుపునొప్పితో మృతిచెందినట్లు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లను కోరారు.

బావిలో పడి యువకుడు మృతి

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి పంచాయతీ ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరినాయుడు(32) ఆదివారం బావిలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరినాయుడుకు మద్యం అలవాటు ఉంది. మద్యం అతిగా సేవించి స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియడం లేదు. గమనించిన స్థానికులు వెంటనే బావి నుంచి వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకుని వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌరినాయుడుకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు చిన్న, కల్పన ఉన్నారు. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని కోటబొమ్మాళి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

క్వాంటమ్‌తో సమూల మార్పులు   1
1/2

క్వాంటమ్‌తో సమూల మార్పులు

క్వాంటమ్‌తో సమూల మార్పులు   2
2/2

క్వాంటమ్‌తో సమూల మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement