 
															ఏపీసీపీఎస్‌ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం శ్రీకాకుళంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఎన్నికల అధికారి బి.బాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులు చల్లా దుర్గాప్రసాద్, గురుగుబెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గురుగుబెల్లి భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడిగా చల్ల సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా అంపోలు షణ్ముఖరావు, సహాధ్యక్షుడిగా బొడ్డు శేఖర్, ఆర్థిక కార్యదర్శిగా యాళ్ల శ్యాంసుందర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, మహిళా అధ్యక్షురాలుగా పి.జయమ్మ, రాష్ట్ర కౌన్సిలర్లగా కరిమి రాజేశ్వరరావు, వడమ శరత్‌బాబు, సూర్య, బుసకల ఈశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులుగా బోణిగి శ్యాం కుమార్, పైడి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులుగా బొడ్డేపల్లి శ్రీనివాస్, సుంకర్ విజయ్, పి.సిమ్మన్న, బి.ప్రదీప్‌చంద్ర వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
